11 July, 2026 | 4:52 AM

అధికారంతో అడ్డదారిలో బిల్లులు కాజేసేందుకు రంగం సిద్దం

11-07-2026 01:50 AM

చండ్రుగొండ, జులై 10, (విజయక్రాంతి): అధికార పార్టీ బలంతో చండ్రుగొండ పంచాయతీలో అడ్డదారిలో రూ.లక్షల రూపాయలు కాజేసేందుకు ప్రజాప్రతినిధులు సిద్ధమైనట్టు చండ్రుగొండ యువజన నాయకులు రాయి రాజా, ఎస్కీ నాగుల్ మీరా, తంబళ్ల మంగయ్యలు ఆరోపించారు. శుక్రవారం చండ్రుగొండ గ్రామ పంచాయతీలో అడ్డదారిలో బిల్లులు డ్రాచేసేందుకు సిద్ధంగా ఉన్న మట్టిరోడ్లను(గ్రావెల్ రోడ్లు) వారు పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ఏడాది సిఎం రేవంత్ రెడ్డి మండల పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభ స్థలానికి తోలిన గ్రావెలు కొన్ని అంతర్గత రోడ్లకు పోసి, పంచాయతీరాజ్ అధికారులను అడ్డుపెట్టుకొని రికార్డులు(ఎంబిలు) తయారు చేసుకొని, తప్పుడు మార్గంలో రూ.లక్షల రూపాయలు కాజేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని ఆరోపించారు.

పంచాయతీరాజ్ అధికారులు పనులు జరగకుండా ఎలా బిల్లులు చేస్తారని ప్రశ్నించారు. అధికార పార్టీ నాయకులు ఎలా చెబితే చండ్రుగొండ గ్రామ పంచాయతీలో అలా బిల్లులు, డబ్బలు డ్రా అవుతు న్నాయని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలన్నారు. గ్రామ పంచాయతీలో నిధుల గో ల్మాల్ పై  సమగ్ర విచారణ చేపట్టాలని, మం డల పరిషత్ అధికారులు ఎందుకు మౌనం గా ఉన్నారో అర్థం కావడంలేదన్నారు. అధికారుల తీరు మారకపోతే పంచాయతీ కార్యా లయాన్ని దిగ్బంధిస్తానని హెచ్చరించారు.