30 April, 2026 | 4:51 AM

టెన్త్‌లో సెయింట్ పాల్స్ హవా

30-04-2026 02:13 AM

కరీంనగర్, ఏప్రిల్ 29(విజయక్రాంతి): పదవ తరగతి ఫలితాల్లో వావిలాలపల్లిలోని సెయింట్ పాల్స్ హైస్కూల్ అద్భుత ప్రతిభను కనబరిచారు. ఈ ఫలితాల్లో ఎ.ఆశ్రిత 574 మార్కులతో పాటు మరో 15 మంది విద్యార్థులు 500 కి పైగా మార్కులు సంపాదించారు.ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ రాజ్ కుమార్, పాఠశాల ప్రిన్సిపాల్ మరియు కరెస్పాండెంట్ లీనా ప్రియదర్శిని మాట్లాడుతూ విద్యార్థుల విజయంపై ఆనందం వ్యక్తం చేశారు. కష్టపడి చదివిన విద్యార్థులు, ఉపాధ్యాయుల కృషి ఫలితమే ఈ విజయానికి నిదర్శనమన్నారు. పాఠశాలలో విద్యా ప్రమాణాలను ఎప్పటికప్పుడు మెరుగుపరు స్తూ, నాణ్యమైన విద్య అందించడానికి కట్టుబడి ఉందని తెలిపారు.

ఈ సందర్భంలో పాఠశాల యాజమాన్యం రాబోయే విద్యా సంవత్సరాల్లో ఇంకా మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రత్యే క కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది.డిజిటల్ లెర్నింగ్ పద్ధతులు, ప్రత్యేక కోచింగ్ తరగతులు, సందేహ నివృత్తి సెషన్లు నిర్వహించడం ద్వారా ప్రతి విద్యార్థి సామర్థ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.అదేవిధంగా, వెనుకబడిన విద్యార్థులకు అదనపు శ్రద్ధతో బోధన అందిస్తూ, వారిని కూడా ఉన్నత ఫలితాల వైపు దారితీసేలా చర్యలు తీసుకుంటున్నారని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.

విద్యార్థుల మానసిక అభివృద్ధి కోసం కౌన్సెలింగ్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉపాధ్యాయులు ప్రతివిద్యార్థిని వ్యక్తిగతంగా ప్రోత్సహిస్తూ, వారి ప్రతిభను వెలికితీసిన విధా నం ప్రశంసనీయమని తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు.టాప్లో నిలిచిన విద్యార్థులు తమ విజయ రహస్యాన్ని పంచుకుంటూ క్రమశిక్షణ, సమయపాలన, గురువుల మార్గదర్శకతతో ఈ విజయం సాధించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని ఉపాధ్యాయులను అభినందించారు.