భూపాలపల్లి డీటీవోగా శ్రీనివాస్ నియామకం
30-06-2026 12:11 AM
జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) జూన్ 29 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా రవాణాశాఖ అధికారిగా బీ. శ్రీనివాస్ నియమితులయ్యారు. భూపాలపల్లి డిటిఓ వెంకన్న టిప్పర్ ఢీకొని మరణించిన నేపథ్యంలో ఖాళీ ఏర్పడ్డ డిటీవో స్థానంలో శ్రీనివాస్ నియమితులయ్యారు. సోమవారం డిటిఓ శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఐడిఓసి కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.






