30 June, 2026 | 1:20 AM

నరకప్రాయంగా షాద్‌నగర్ చౌరస్తా!

30-06-2026 12:10 AM
  1. ప్రయాణం అంటేనే ప్రజల్లో వణుకు 
  2. పెరుగుతున్న రద్దీ... స్తంభించిన అత్యవసర సేవలు 
  3. మున్సిపల్ తీర్మానం లేదు... హెచ్‌ఎండిఏ చర్యలు..
  4. గాల్లో కలుస్తున్న ప్రాణాలు

షాద్నగర్, జూన్ 29 (విజయక్రాంతి): అది పట్టణానికి గుండెకాయ లాంటి ప్రాం తం.. నాలుగు ప్రధాన రహదారుల కూడలి.. కానీ నేడు అదే కూడలి ప్రయాణికులకు శా పంగా, ప్రమాదాలకు నిలయంగా మారింది. ఒకవైపు బస్టాండు, మరోవైపు పరిగి రహదారి, ఇంకోవైపు హైదరాబాద్ పాత జాతీ య రహదారి (ఎన్ హెచ్ -44).. ఇలా అన్నింటికీ అనుసంధానంగా నిలిచిన షాద్నగర్ చౌ రస్తా తీవ్ర సమస్యల వలయంలో చిక్కుకుం ది. పారిశ్రామిక, వాణిజ్య, విద్యా రంగాల వి స్తరణతో ఈ ప్రాంతంలో వాహనాల రద్దీ రో జురోజుకూ నరకప్రాయంగా మారుతోంది. నిత్యం వేలాది లారీలు, టిప్పర్లు, భారీ వాహనాలు ఇక్కడి నుంచే రాకపోకలు సాగిస్తుం డటంతో స్థానికులు ప్రాణాలు గుప్పిట్లో పె ట్టుకుని ప్రయాణించాల్సి వస్తోంది.

రక్తసిక్తమవుతున్న కూడలి.. స్తంభిస్తున్న సేవలు

గత ఏడాది జూలై 26న ఇక్కడ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు అక్కడికక్కడే మృతి చెందడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. ఇదిలా ఉంటే, ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ కిలోమీటర్ల మేర స్తంభించిపోతోంది. అత్యవసర వైద్య సేవలందించే అంబులెన్సులు కూడా గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుపోతుండటంతో బాధితుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారుతున్నాయని స్థానికులు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు చేపడుతున్న తాత్కాలిక చర్యలు ఏమాత్రం సరిపోవడం లేదు.

బాధితుల ఆందోళన..

చౌరస్తా విస్తరణ పనులు నత్తనడకన సాగడానికి ప్రధాన కారణం భూసేకరణ మరియు నష్టపరిహారంపై స్పష్టత లేకపోవడమే. రోడ్డు వెడల్పు చేయాలంటే ఇరువైపు లా ఉన్న ఇళ్లు, వాణిజ్య సముదాయాలను తొలగించాల్సి ఉంటుంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విస్తరణకు సహకరించాలని అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికా రులు కోరుతున్నారు తప్ప.. ఇళ్లు, దుకాణా లు కోల్పోయే బాధితులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎంత నష్టపరిహారం చెల్లిస్తా రనే దానిపై మాత్రం నోరు మెదపడం లేదు.

కాగితాలకే పరిమితమైన హామీలు

మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఇంత పెద్ద సమస్యపై షాద్నగర్ మున్సిపాలిటీలో ఇప్పటివరకు ఎలాంటి అధికారిక తీర్మానం చేయలేదు. కౌన్సిల్లో ప్రతిపాదనలు పెట్టకుండా ఈ విస్తరణను ఎ లా ముందుకు తీసుకెళ్తారో తెలియని పరిస్థి తి నెలకొంది. గత మార్చి 31వ తేదీన హెచ్‌ఎండిఏ అధికారి విశ్వతేజ స్వయంగా చౌర స్తాను సందర్శించి విస్తరణ పనులు చేపడతామని ప్రకటించినా.. నేటికీ క్షేత్రస్థాయిలో ఒ క్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇ ప్పటికైనా ప్రభుత్వం ఈ పనులను పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.