28 February, 2026 | 2:17 PM

వైభవంగా శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణం వేడుకలు..

28-02-2026 12:16 PM

సుల్తానాబాద్, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని  శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా  రుక్మిణి, సత్యభామ సమేత  శ్రీ వేణుగోపాలస్వామి కళ్యాణోత్సవం అంగరంగ  వైభవంగా, కన్నుల పండువగ జరిగింది. అంతకుముందు యాగశాల ప్రవేశం చేశారు, శ్రీ వాసవి మాత దేవాలయం లో స్వామి వారి ఎదుర్కోళ్ల కార్యక్రమం నిర్వహించారు, వేణుగోపాల స్వామి ఆలయ ఆవరణ లో తిరు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పలు రకాల ప్రసాదాలు స్వామివారికి సమర్పించారు, అర్చకులు సౌమిత్రి శ్రావణ్  కుమార్, వేణుమాధవు తోపాటు పలువురు అర్చకులు  కళ్యాణ వేడుకలను ఘనంగా జరిపించారు, ఆలయ చైర్మన్ పల్ల మురళీధర్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి...