మున్సిపల్ వార్డులో పర్యటించిన చైర్మన్ నగేష్ శేట్కార్
వార్డులో నెలకొన్న సమస్యలు పై ప్రత్యేక దృష్టి
నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మున్సిపల్ పట్టణం లో మున్సిపల్ చైర్మన్ నగేష్ శేట్కార్(Chairman Nagesh Shetkar) శనివారం ఉదయం మున్సిపల్ వార్డుల్లో పర్యటించి ఆయా వార్డులలో నెలకొన్న సమస్యలను ప్రజల నుండి ఆయన తెలుసుకున్నారు. వార్డులలో ఉన్న డ్రైనేజీ సమస్యలు, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులకు తమ సూచనలు సలహాలు అందజేశారు.
వార్డుల్లో సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే సత్వరమే పరిష్కారానికి తగు చర్యలు చేపడుతామని ఆయన స్థానికులతో అన్నారు. పట్టణంలో త్వరలోనే రోడ్ల మరమ్మత్తు సమస్యల సైతం పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. అవసరమైన చోట ప్రత్యేక మురుగు కాలువల నిర్మాణం చేపట్టాలని సూచించారు. చైర్మన్ వెంట కౌన్సిలర్లు బాణాపురం రాజు, వివేకానంద, మహేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు చామకూర పాండు, ముదిరాజ్ శంకర్ తదితరులు ఉన్నారు.




