1 August, 2026 | 5:53 PM

Breaking News

వరదలు సాధారణ స్థితికి వచ్చే వరకు పునరావాస కేంద్రాల్లోనే ముంపు బాధితులు తల దాచుకోవాలి   •   అడ్మిషన్ పేరుతో విద్యార్థుల నుండి పైసలు వసూలు   •   సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ క్రాంతి   •   నవజాత శిశువుకు తల్లిపాలే రక్షణ కవచం   •   ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం   •   ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపర్చాలి   •   రిఫీలింగ్ సెంటర్లపై దాడి.. 16 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం   •   అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలి   •   విద్యార్థులకు అండగా నిలబడడమే 'యూత్ ఫర్ సేవ' లక్ష్యం   •   కోనరావుపేట మండలంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీల ఏర్పాటు   •  

అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం

21-02-2026 06:02 PM

* స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన జిల్లా ఎస్పీ

తలమడుగు,(విజయక్రాంతి): తలమడుగు మండలం బరంపూర్ లోని సుప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. గత మూడు రోజుల పాటు జరగనున్న వివిధ పూజాది కార్యక్రమాల్లో భక్తులు పెద్దఎత్తున పాల్గొని పూజలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే శనివారం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఆలయానికి వచ్చిన జిల్లా ఎస్పీకి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి,  స్వామివారికి ప్రత్యేక పూజల చేయించారు.

శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ఎస్పీకి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. స్వామివారి కరుణ కృపా కటాక్షాలు జిల్లా ప్రజలందరిపై ఉండాలని ఎస్పీఆకాంక్షించారు. ఆలయ చరిత్ర గురించి స్థానికులు ఎస్పీకి వివరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి,  తాంసి ఎస్ఐ జీవన్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ ముడుపు కేదారేశ్వర్ రెడ్డి, కోశాధికారి బర్కం మల్లేష్, మాజీ డీసీసీబీ చైర్మన్ దామోదర్ రెడ్డి, మాజీ డెయిరీ మాజీ చైర్మన్  లోక భూమారెడ్డి,పలువురు భక్తులు తదితరులు ఉన్నారు.