1 August, 2026 | 5:25 PM

అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలి

01-08-2026 04:19 PM

* డిఎల్పిఓ ప్రభాకర్

 ఉట్నూర్,(విజయక్రాంతి): గ్రామపంచాయతీలో అభివృద్ధి పనులకు  ప్రతిపాదనలు సిద్ధం చేయాలని డివిచరల్ పంచాయతీ అధికారి  ప్రభాకర్ గ్రామ కార్యదర్శులకు ఆదేశించారు. ఇంద్రవెల్లి మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2026-27 సంవత్సరానికి గాను  16 ఫైనాన్స్  నిధులను సద్యోగం చేసుకున్నందుకు  గ్రామపంచాయతీ కేంద్రాలలో గ్రామసభలు నిర్వహించి గ్రామాల అభివృద్ధి కావలసిన అభివృద్ధి పనులను  ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాలని  అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను  వేగవంతం చేసి పనులు పూర్తి అయ్యేలా  ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు  గ్రామాల్లో దోమల  పెరుగుదల  ఉందని, పారిశుద్ధ్య పనులు ఎప్పటికప్పుడు నిర్వహించాలని  సూచనలు చేశారు. ప్రతి శుక్రవారం  డ్రైడే కార్యక్రమాలు నిర్వహించాలని  అన్నారు. గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న మరుగుదొడ్ల నిర్మాణం పనులు వేగవంతం చేయించాలని కార్యదర్శులు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఎంపీడీవో  మహేందర్, ఎంపీ ఈ ఓ సంజీవరావు, డిపిఎం శ్రావణ్ , పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.