1 August, 2026 | 4:57 PM

విద్యార్థులకు అండగా నిలబడడమే 'యూత్ ఫర్ సేవ' లక్ష్యం

01-08-2026 04:17 PM

* ​కందుకూరు బాలికల పాఠశాలలో విద్యా సామగ్రి పంపిణీ

​కందుకూరు,(విజయక్రాంతి): స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో 'యూత్ ఫర్ సేవ' సంస్థ ఆధ్వర్యంలో శనివారం 11 మంది అనాథ, పేద విద్యార్థినులకు స్కూల్ బ్యాగులు, నోటు పుస్తకాలు, కంపాస్ బాక్సులను పంపిణీ చేశారు.​ ఈ సందర్భంగా సంస్థ నేత శ్రీకాంత్ మాట్లాడుతూ... నిరుపేద విద్యార్థులకు విద్యా సహాయం అందిస్తూ అండగా నిలవడమే తమ లక్ష్యమని, విద్యార్థులు బాగా చదివి ఉన్నత ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు లేని విద్యార్థులకు సాయం అందించినందుకు హెచ్‌ఎం ఎస్. కవిత సంస్థ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు.​హెచ్‌ఎం ఎస్. కవిత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు కె. గోపాల్ సమన్వయకర్తగా వ్యవహరించగా, సంస్థ ప్రతినిధులు శ్రీకాంత్, కానిస్టేబుల్ ప్రవీణ్, అనిల్, అభిలాష్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.