1 August, 2026 | 5:25 PM

ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం

01-08-2026 04:26 PM

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఈ నెల 9న జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జాదవ్ అంబాజీ పిలుపునిచ్చారు. శనివారం పీఎంఆర్సీ కార్యాలయంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివాసీల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పేఈ వేడుకలను ఐక్యతతో నిర్వహించాలని, అన్ని ఆదివాసీ సంఘాలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, యువత పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిడాం అర్జు మాస్టర్, సార్‌మేడి జ్ఞానేశ్వర్, పెందూర్ సుధాకర్, వెంకటేష్, పూర్కా ఉద్దవ్, కొట్నాక్ శకుంతల, మాడావి శేఖు తదితరులు పాల్గొన్నారు.