1 August, 2026 | 5:06 PM

రిఫీలింగ్ సెంటర్లపై దాడి.. 16 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం

01-08-2026 04:22 PM

చేగుంట,(విజయక్రాంతి): చేగుంట పట్టణ కేంద్రంలోని మక్క రాజుపేట చౌరస్తాలో ఉన్న ముడు గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రాలపై జిల్లా సివిల్ సప్లై అధికారులు దాడులు నిర్వహించారు. మూడు దుకాణాల్లో తనిఖీలు చేపట్టి 16 సబ్సిడీ గ్యాస్ సిలిండర్లనుస్వాధీనం చేసుకున్నారు. అనంతరం ముగ్గురు దుకాణ యజమానులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మండలంలో ఏవైరైనా అక్రమ గ్యాస్ రీఫిల్లింగకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లై ఇన్స్పెక్టర్ తాటి నర్సింలు తెలిపారు. ఈ కార్యక్రమంంలో స్థానిక తహసీల్దార్ బల్ లక్ష్మి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ జై భరత్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.