21-02-2026 06:06:38 PM
విన్ విజన్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో కంటి వైద్య శిబిరం
మదర్ తెరిసా కాలనీ అధ్యక్షుడు బూడిద వెంకటేష్
జవహర్ నగర్,(విజయక్రాంతి): సర్వేంద్రియానం నయనం ప్రధానమని లోకంలో సర్వ ఇంద్రియాలకు నయనాలే (కనుపాపలు) ప్రధానమని సర్వ జీవరాసులకు నేత్రాలే ప్రధాన అవయవాలను తెలిపారు. అటువంటి అవయవాల రక్షనే ధ్యేయంగా విన్ విజన్ ఫౌండేషన్, బాలవికాస ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో విన్ విజన్ కంటి ఆసుపత్రి యాజమాన్యం ఫిబ్రవరి 22 తేదీన(ఆదివారం) జవహర్ నగర్ పరిధిలోని లెప్రసీ కాలనీలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారని, ఈ వైద్య శిబిరాన్ని మదర్ తెరిసా కాలనీ ప్రజలే కాకుండా జవహర్ నగర్ ప్రజలు ఉపయోగించుకోవాలని తెలిపారు.
ఉచిత కంటి పరీక్షా శిబిరం ఆదివారం స్థానిక మదర్ తెరిసా కమ్యూనిటీ హాల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1:00 వరకు నిర్వహించబడుతుందని ఈ శిబిరం ప్రముఖ నేత్ర వైద్య సంస్థ విన్ విజన్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలోనిర్వహించబడుతుందని, ఈ వైద్య శిబిరం ఎన్ అండ్ ఎన్ ఫౌండేషన్, బాలవికాస ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారని ఇట్టి అవకాశాన్ని జవహర్ నగర్ ప్రజలు ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.