శ్రీ వాసవీ మాత జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించాలి
27-04-2026 12:00 AM
మంథని, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం శ్రీ వాసవి మాత జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది. మంథని మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముసుకుల సహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులు ఆదివారం మంథని పట్టణంలోని కన్యకా పరమేశ్వరి దేవాలయంలోని శ్రీ వాసవి మాత అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన జయంతి వేడుకల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులను పొందారు. అనంతరం శ్రీ వాసవి మాత ఆర్యవైశ్య సంఘ సభ్యులు పాలకవర్గ సభ్యులను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాలక వర్గ సభ్యు లు ఎల్లంకి వంశీధర్, ఆర్య వైశ్య సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.






