27 April, 2026 | 1:34 AM

ఉపాధి హామీలో మున్సిపల్‌కు అవకాశం ఇవ్వాలి

27-04-2026 12:00 AM

 ఖానాపూర్, ఏప్రిల్ ౨౬ (విజయక్రాంతి) : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించి కూలీలకు ఉపాధి కల్పించాలని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్ అన్నారు. మేరకు ఆదివారం హైదరాబాదులో కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డిని కలిసి వారు వినతిపత్రం అందజేశారు. అంకం మౌనిక పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం బిజెపి జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్ ఆధ్వర్యంలో బిజెపి కౌన్సిలర్లు కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డిని కలిశారు.

ఈ సందర్భంగా ఖానాపూర్ పట్టణం గతంలో జిపిగా ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకం ఉండేదని ప్రస్తుతం ఆ సౌకర్యం లేకపోవడంతో మున్సిపాలిటీ కూలీలకు ఉపాధి లేకుండా పోయిం దని దానిని తిరిగి పునః సమీక్షించాలని, దాంతోపాటు పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ, పీజీ కాలేజ్, 100 పుడుకలు ఆసుపత్రి, నూ తన మున్సిపాలిటీ భవనానికి నిధులు మం జూరు చేయాలని వారు పట్టణ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని కేంద్ర మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బొప్పారపు సత్యవతి, గుమ్ముల ఆనంద్ కుమార్ ,ప్రకాష్ గౌడ్, తదితరులు ఉన్నారు.