3 September, 2026 | 2:21 AM

సీఎం కప్-2026 విజేతగా శ్రీ త్రివేణి హైస్కూల్

03-09-2026 | 12:20am

ముషీరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): చంపాపేట్కు చెందిన శ్రీ త్రివేణి హైస్కూల్(Sri Triveni High School) సీఎం కప్(CM Cup)-2026 టైటిల్ను కైవసం చేసుకుంది. నటరాజ్ అకాడమీ 18వ వార్షికోత్సవం సందర్భంగా రవీంద్రభారతి ప్రధాన వేదికపై నిర్వహించిన సీఎం కప్ 2026, ప్రజా పాలనప్రజా కళావైభవం తెలంగాణ సాంస్కృతిక ఉత్సవంలో విద్యార్థులు ప్రదర్శించిన నృత్య రూపకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలంగాణలోని 20కి పైగా ప్రాంతాల నుంచి సుమారు 2,000 మంది విద్యార్థినీ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి ఓఎస్డీ వేముల శ్రీనివాస్ మాట్లాడుతూ.. విద్యతో పాటు కళలు, సంస్కృతి, సాహిత్యం, క్రీడల్లోనూ విద్యార్థులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లల్లోని ప్రతిభను గుర్తించి వారికి తగిన వేదిక కల్పించడం తల్లిదండ్రుల బాధ్యత అని పేర్కొన్నారు. సీఎం కప్2026లో గౌతమ్ హైస్కూల్ ప్రథమ బహుమతి, క్యాండర్ షైన్ స్కూల్, బ్రిలియంట్ స్కూల్ ద్వితీయ బహుమతులు, సెయింట్ ఆడమ్స్, చిక్కడపల్లి తృతీయ బహుమతులు సాధించాయి.