తీజ్ ఉత్సవాల్లో మహాభోగ్ బండార్
బంజారా పాటలకు పోలీసు ఉన్నతాధికారుల పాదం కదుపు
ముషీరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): అశోక్నగర్లోని గాంధీ పార్క్లో నిరుద్యోగ బంజారా యువత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తీజ్ ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఏడో రోజు మహాభోగ్ బండార్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షితమూర్తి, చిక్కడపల్లి ఏసీపీ రణ్వీర్రెడ్డి, ఇన్స్పెక్టర్లు ఖాసిరామ్, మధుబాబు, ఎస్‌ఐ మౌనిక తదితరులు హాజరయ్యారు.
డీసీపీ రక్షితమూర్తి మాట్లాడుతూ ఐకమత్యంతో నిర్వహించే తీజ్ పండుగ సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ఏసీపీ రణ్వీర్రెడ్డి మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులు విద్యార్థులపై ఉండాలని, వారు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఇన్స్పెక్టర్ ఖాసిరామ్ మాట్లాడారు.
ఈ కార్యక్రమానికి హాజరైన ట్రైకార్ మాజీ చైర్మన్ బెల్లయ్య నాయక్, ఏసీపీ రణ్వీర్రెడ్డి, ఇన్స్పెక్టర్లు ఖాసిరామ్, మధుబాబు, రాజగోపాల్ రెడ్డి, ఎస్‌ఐలు మౌనిక, దుర్గాలను ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.
అనంతరం పోలీసు అధికారులు విద్యార్థులతో కలిసి బంజారా పాటలకు నృత్యం చేయడం ఆకట్టుకుంది. నిరుద్యోగ జేఏసీ నేత శంకర్ నాయక్ మాట్లాడుతూ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపారు. సెప్టెంబర్ 3న తీజ్ నిమజ్జనం నిర్వహించనున్నట్లు, అశోక్నగర్ నుంచి హుస్సేన్సాగర్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాస్కర్, ఓమేష్, రవి రాథోడ్, శివ నాయక్, ఆనంద్, కిరణ్ రాథోడ్, బాలకోటి, మోతిలాల్, విష్ణు, నరసింహ, కుమార్, వైష్ణవి, జ్యోతి, బిందు తదితరులు పాల్గొన్నారు.






