10 March, 2026 | 5:07 PM

శ్రీరామనవమి ఉత్సవాలు జయప్రదం చేయండి

10-03-2026 03:51 PM

నిర్మల్,(విజయక్రాంతి): పట్టణంలోని బాగలవాడ శ్రీ రామాలయం నూతన(Sri Ram Navami celebrations) ఉత్సవ కమిటీని స్థానిక కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం ఎన్నుకున్నారు. త్వరలో నిర్వహించి శ్రీరామనవమి ఉత్సవాలను ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శ్రీ రామాలయం వాల్మీకి నగర్ కమిటీ తరఫున పెద్ద ఎత్తున చేయడం కోసం ఏర్పాట్లను చేస్తున్నట్టు కౌన్సిలర్ తెలిపారు.

సీతారామ కళ్యాణ మహోత్సవం పత్రికను ప్రధాన అర్చకులు రామన్న ఆచార్యులు మరియు 9 వార్డు కౌన్సిలర్ గారు గౌరవ మంచాల శ్రీకాంత్ యాదవ్ గారు రామాలయం కమిటీ అందరికీ ధన్యవాదాలు తెలుపడం జరిగింది మరియు సీతారామ కళ్యాణ మహోత్సవం సంబంధించిన కరపత్రాలను ప్రధాన అర్చకులు రామన్నాచార్యులు కౌన్సిలర్  శ్రీకాంత్ యాదవ్ మరియు కమిటీ సభ్యులు మరియు వార్డు సభ్యులు యూత్ సభ్యులు మహిళలు వచ్చి కరపత్రాలను విడుదల చేయడం జరిగింది జరగబోయే శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి అందరు సహకరించాలని పేరుపేరునా కోరడం జరిగింది