11 April, 2026 | 3:46 PM

Breaking News

ఐలాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్.. కూల్చివేతలపై రంగనాథ్ క్లారిటీ!   •   తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు   •   ఇప్పుడు ఎన్నికలు జరిగినా... కాంగ్రెస్‌కు 100 సీట్లు ఖాయం   •   కలెక్టర్ కార్యాలయంలో పూలే జయంతి వేడుకలు   •   జ్యోతిరావు పూలే జయంతి ఆశయ సాధన కోసం కృషి చేయాలి   •   20న జగిత్యాలలో కేసీఆర్ సభ... జీవన్ రెడ్డి చేరిక — బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం   •   లబ్ధిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ   •   సారంపల్లిలో శిరీష వివాహానికి కరీంనగర్ డెయిరీ పుస్తెమట్టెలు అందజేత   •   మొక్కజొన్న పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోని విక్రయించాలి   •   నాకు నమ్మకం ఉంది.. వచ్చేది మా ప్రభుత్వమే: కేటీఆర్   •  

దీపావళికి శ్రీమహాశక్తి ఆలయం ముస్తాబు

19-10-2025 12:20 AM
  1. నేటి నుంచి ఈ నెల 21 వరకు పర్వదిన వేడుకలు
  2. ధన త్రయోదశి నాడు అమ్మవార్లకు నాణేలతో పూజ
  3. విద్యుద్దీపాలంకరణలతో వెలిగిపోతున్న దేవాలయం
  4. పాల్గొననున్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్

కరీంనగర్, అక్టోబర్ 18 (విజయ కాంతి): దీపావళి పర్వదిన మహోత్సవానికి కరీంనగర్‌లోని మహిమాన్విత దివ్య క్షేత్రం శ్రీమహా శక్తి దేవాలయం శరవేగంగా ముస్తాబవుతుంది. శ్రీమహాదుర్గ, శ్రీమహాలక్ష్మి, శ్రీమహా సరస్వతి అమ్మవార్ల కొలువుదీరిన మహిమాన్విత దివ్యక్షేత్రంలో దీపావళి పం డుగ కోసం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఆదివారం నుంచి ఈ నెల21 వరకు జరిగే దీపా వళి పర్వదిన మహోత్సవ వేడుకలను అత్యం త భక్తిశ్రద్ధలతో కనుల పండువు గా నిర్వహించడానికి ఆలయ నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

సమస్త భక్తుల కు మ హాశక్తి దేవాలయం కనువిందు చేసేలా దేవాలయ ప్రాంగణాన్ని వివిధ రకాల పూల అ లంకరణలతో, ఆకర్షణీయమైన విద్యుత్ దీ పాలతో ముస్తాబు చేయిస్తున్నారు. ఆల య ప్రాంగణం ఆకట్టుకునే విద్యుద్దీపాల అ లంకరణల వెలుగులతో విరజిమ్మేలాఏర్పాట్లు చేస్తున్నారు.

దీపావళి పర్వదిన మహోత్సవ వేడుకల్లో భాగంగా ఆదివారం ధన త్రయోదశి సందర్భంగా సాయంత్రం 6 గంటలకు అమ్మవార్లకు నాణేలతో పూజ, పుష్పాభిషేకం, రాత్రి 7.30 గంటల నుంచి అమ్మవా ర్లకు మహాభిషేకం, మంగళ ద్రవ్యాభిషేకం,  సోమవారం నరక చతుర్దశి, దీపావళి పండు గ సందర్భంగా ఉదయం 8 గంటలకు అమ్మవార్లకు మహాహారతి, 9 గంటలకు లక్ష్మి కుబే ర హోమం పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడానికి ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ వేడుకల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. దీపావళి పర్వదిన మహోత్సవ పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవార్ల అనుగ్రహానికి పాత్రులు కాగలరని ఆలయ నిర్వాహకులు కోరారు.