2 July, 2026 | 3:47 AM

ఏపీ ఈఏపీసెట్-లో శ్రీ చైతన్య సత్తా

02-07-2026 12:00 AM

 ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు

హైదరాబాద్, జూలై 1 (విజయక్రాంతి): ఏపీ ఈఏపీసెట్--2026 ఫలితాల్లో శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ విద్యార్థులు ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకులతో పాటు టాప్ ర్యాంకులను కైవసం చేసుకుని ప్రతిభ చాటారు. ఇంజినీరింగ్ విభాగంలో జొన్నల రోషన్ మనిదీప్‌రెడ్డి స్టేట్ 1వ ర్యాంక్, కొరుకొండ శ్రావ్య 2వ ర్యాంక్, ముక్కర సాకేత్ 6వ ర్యాంక్, బండి వెంకట సాత్విక్ 7వ ర్యాంక్, పసాల మోహిత్ 9వ ర్యాంక్, మారక వంశీధర్ రెడ్డి 10వ ర్యాంక్ సాధించారు.

అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో సంబంగి జశ్వంత్ నాయుడు స్టేట్ 1వ ర్యాంక్, కుడుముల వెంకట మహంత్ అక్షజ్ రెడ్డి 2వ ర్యాంక్, కొండ్రెడ్డి హారికాదేవి శ్రీ అనుహ్య 3వ ర్యాంక్, దండమూడి జాగృతి 8వ ర్యాంక్, రేలంగి జయ శన్ముఖి 10వ ర్యాంక్ సాధించారు. ఈ ఏడాది ఇంజినీరింగ్లో టాప్-10లో 6 ర్యాంకులు, అగ్రికల్చర్/ఫార్మసీలో టాప్-10లో 5 ర్యాంకులు, టాప్-100లో మొత్తం 97 ర్యాంకులు శ్రీ చైతన్య విద్యార్థులు సాధించినట్లు విద్యా సంస్థల అకాడమిక్ డైరెక్టర్ సుష్మ తెలిపారు. అధ్యాపకులు, తల్లిదండ్రులను అభినందించారు.