2 July, 2026 | 2:42 AM

16 నుంచి సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నీ

02-07-2026 01:05 AM

హైదరాబాద్, జూలై 1 : 12వ తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ అండర్- బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీలు ఈ నెల 16 నుంచి 19 వరకు మణికొండలోని మ్యాచ్ పాయింట్ ప్రైడ్ అకాడమీలో జరగనున్నట్లు రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కరెడ్ల శ్రీనివాసరావు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసి యేషన్, రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సహకారంతో ఈ పోటీలను నిర్వ హిస్తున్నట్లు ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పోటీల్లో పాల్గొనదలచిన క్రీడాకా రులు ఈ నెల 13లోగా తమ ఎంట్రీలను న మోదు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రతిభావంతులైన అండర్ ప్లేయ ర్స్‌కు ఈ చాంపియన్‌షిప్ మంచి వేదికగా నిలుస్తుందని తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచే క్రీడాకారులకు రాష్ట్ర స్థాయిలో త మ సత్తా చాటుకునే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు.