5 August, 2026 | 1:09 AM

ఘనంగా శ్రీచైతన్య ఫ్రెషర్స్‌డే వేడుకలు

05-08-2026 12:00 AM

రైజ్ ఆఫ్ అచీవర్స్ అండ్ రాక్ స్టార్స్ 2కే, 

ఇంటర్ కాలేజ్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ కార్యక్రమాల నిర్వహణ

హైదరాబాద్, ఆగస్టు 4(విజయక్రాంతి): విద్యా రంగంలో నాలుగు దశాబ్దాల స్టదీర్ఘ అనుభవంతో ఘనమైన వారసత్వాన్ని కలిగిన శ్రీచైతన్య విద్యా సంస్థలు కావూరి హిల్స్ జోన్ ఆధ్వర్యంలో ‘ఆర్‌వోఏఆర్- రైజ్ ఆఫ్ అచీవర్స్ అండ్ రాక్‌స్టార్స్ 2కే26 ఫ్రెషర్స్ డే వేడుకలు, ఇంటర్ కాలేజ్ స్పోర్స్ కాంపిటీషన్స్ మంగళవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్స్ స్టేడియంలో అత్యంత వైభవంగా నిర్వహించారు.

ఈ కారాక్రమానికి ముఖ్య అతిథులుగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం.రమేష్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి.సృజన, డిప్యూటీ పోలీస్ కమిషనర్ రీతిరాజ్ హాజరయ్యారు. అతిథులు తమ ప్రసంగంలో భవిష్యత్ విజేతలను తీర్చిదిద్దడంలో శ్రీచైతన్య విద్యాసంస్థలు పడుతున్న నిరంతర శ్రమను కొనియాడారు. శ్రీచైతన్య అందిస్తున్న ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థను విద్యార్థులు సరైన రీతిలో ఉపయోగించుకుని అత్యుత్తమ ఫలితాలను సాధించాలని పిలుపునిచ్చారు.

ప్రత్యేక అతిథిగా హాజరైన ప్రముఖ సినీ నటుడు నిఖిల్ సిద్దార్ధ తన ఉత్తేజపూరితమైన ప్రసంగంతో విద్యార్థుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. ఓటమికి భయపడకుండా అనుకున్న లక్ష్యం దిశగా అడుగులు వేయాలన్న యువత తమ కలలను నిజం చేసుకునే వరకు విశ్రమించకూడదన్న పిలుపునిచ్చారు. ఈ వేడుకలో శ్రీచైతన్య విద్యా సంస్థలకు చెందిన సుష్మా బొప్పన, సీమా బొప్పన (అకాడమిక్ డైరెక్ట ర్లు), శ్రీధర్, నాగేంద్ర(డైరెక్టర్లు) ముఖ్య భూమిక పోషించి విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. ప్రముఖ టీవీ యాంకర్, నటుడు రవి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యతగా వ్యవహరించారు.