11 August, 2026 | 6:47 PM

మాల్తుమ్మెద గ్రామంలో గడ్డి మందు పిచికారి

11-08-2026 05:21 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని మాల్తుమ్మెద గ్రామంలో వానాకాలం సందర్భంగా గ్రామంలో ఈగలు,దోమలు చేరకుండా దుర్వాసన వెదజల్లకుండా గ్రామ ప్రజలు,పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని ఉద్దేశంతో మాల్తుమ్మెద గ్రామంలో మూడు రోజుల నుండి గడ్డి మందు పిచికారి చేయడం జరిగిందని గ్రామ సర్పంచ్ పుప్పాల సాయిలు తెలిపారు. ఒకేసారి ట్రాక్టర్లో 4 డ్రమ్ముల్లో గడ్డి మందు కలిపి మిషన్కు 100 మీటర్ల పైపు ఏర్పాటు చేసి ప్రతి గల్లీలో ఉన్న రోడ్లు, డ్రైనేజీ, ఇండ్ల చుట్టూ పరిసర ప్రాంతాల్లో గడ్డి మందు పిచికారి చేయడం జరిగిందన్నారు.గ్రామ సర్పంచ్ పుప్పాల సాయిలు వీధుల వెంబడి గడ్డి మందు పిచికారి చేశారు.ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు,గ్రామస్తులు ఉన్నారు.