పిల్లల కోసం క్రీడా ప్రాంగణం ఏర్పాటు
22-04-2026 01:51 AM
13వ వార్డు మెంబర్ శ్రీలతకి కృతజ్ఞతలు తెలిపిన స్థానికులు
జగదేవ్‌పూర్, ఏప్రిల్ 21(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌లోని 13వ వార్డు మెంబర్ పన్నీరు శ్రీలత రామచంద్రంకి ఆ వార్డు ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 13వ వార్డులో పిల్లల కోసం వేరే వాళ్ల స్థలం వాళ్లతో మాట్లాడి పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్‌ను ఏర్పాటు చేసి, పిచ్చి మొక్కలు తొలగించే చర్యలు చేపట్టారు.
అలాగే సర్పంచ్‌తో మాట్లాడి గ్రౌండ్‌లో మొరం పోయించి ఆడుకునేందుకు వీలుగా వసతి ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్, మొబైల్ చూస్తున్న రోజుల్లో పిల్లలను దృష్టిలో ఉంచుకొని వారికోసం క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసినందుకు స్థానికులు వార్డు సభ్యురాలు శ్రీలతకి కృతజ్ఞతలు తెలిపారు.






