వెంకటేశ్వరపల్లి శివారులో జూద స్థావరంపై పోలీసుల దాడి
రూ.3,030 నగదు, 52 ప్లేయింగ్ కార్డులు, 4 సెల్‌ఫోన్లు స్వాధీనం
ముత్తారం ఎస్ఐ రవికుమార్
ముత్తారం,విజయక్రాంతి: ముత్తారం మండలం ఓదేడు గ్రామ పరిధిలోని వెంకటేశ్వరపల్లి గ్రామ శివారులో డబ్బులు పందెంగా పెట్టి మూడు కార్డులతో జూదం ఆడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. శుక్రవారం (14-08-2026) సాయంత్రం 4 గంటల సమయంలో జూదం జరుగుతున్నట్లు నమ్మదగిన సమాచారం అందడంతో ఎస్సై, పోలీసు సిబ్బంది 1092, 1466లతో కలిసి వెంకటేశ్వరపల్లి శివారుకు వెళ్లారు.
సాయంత్రం 4:30 గంటల సమయంలో జూద స్థావరంపై దాడి చేయగా నలుగురు వ్యక్తులు డబ్బులు పందెంగా పెట్టి మూడు కార్డులతో జూదం ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. వారిని అదుపులోకి తీసుకుని పంచ సాక్షుల సమక్షంలో విచారించగా తమ వివరాలను కందుల రాజు (48), సముద్రాల మల్లయ్య (65), దేవునూరి సదయ్య (42), తోట ప్రదీప్ (25)గా వెల్లడించారు. వీరంతా ఓదేడు గ్రామానికి చెందినవారిగా పోలీసులు తెలిపారు.
విచారణలో నలుగురు వ్యక్తులు తాము కలిసి డబ్బులు పందెంగా పెట్టి జూదం ఆడినట్లు అంగీకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి 3 స్మార్ట్‌ఫోన్లు, ఒక కీప్యాడ్ ఫోన్, రూ.3,030 నగదు, 52 ప్లేయింగ్ కార్డులను పంచ సాక్షుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై నిందితుల ఒప్పుకోలు వాంగ్మూలాలను నమోదు చేసి, కన్ఫెషన్ కమ్ సీజర్ పంచనామా ద్వారా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. జూదం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.






