నగరంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
కరీంనగర్,(విజయక్రాంతి): స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం నగరంలో ఘనంగా జరిగాయి. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలోని కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ గార్డ్ వద్ద పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అలాగే, కమిషనరేట్ పరిపాలనా కార్యాలయం (సిపిఓ) వద్ద అడిషనల్ డి.సి.పి. (పరిపాలన) పి.వెంకటరమణ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కమిషనరేట్లోని పోలీసు ఉన్నతాధికారులు, మినిస్టీరియల్ విభాగం అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బస్ స్టేషన్ ఆవరణలో...
డా॥ బి.ఆర్. అంబేడ్కర్ బస్ స్టేషన్, కరీంనగర్ ఆవరణలో కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పగిడిమర్రి సోలమన్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు అవార్డుల ప్రదానం చేశారు. ఈ కార్యక్రమములో రీజనల్ మేనేజర్ బి రాజు, జోనల్ సెక్యూరిటీ అధికారి భూమ రావు, విజిలెన్స్ ఇన్స్పెక్టర్ ఎం. రవీందర్, డిప్యూటీ రీజనల్ మేనేజర్లు ఎస్. భూపతి రెడ్డి, పి మల్లేశం, పర్సనల్ ఆఫీసర్ ఎం సంపత్ కుమార్, పాల్గొన్నారు. కరీంనగర్ - 1,2 డిపోలలో డిపో మేనేజర్లు ఐ. విజయమాధురి, ఎం. శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
టీఎన్జీవో భవనంలో...
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కరీంనగర్ టీఎన్జీవో కమ్యూనిటీ హాల్ ఆవరణలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు, ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి సంగం లక్ష్మణరావు, టీజీవో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మడిపల్లి కాళీచరణ్ గౌడ్, అరవింద్ రెడ్డి, లక్ష్మీనరసింహారావు, ముప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి, సర్దార్ అర్మేందర్ సింగ్, రాగి శ్రీనివాస్ గౌడ్, ప్రభాకర్ రెడ్డి, ఒంటెల రవీందర్ రెడ్డి, ఒంటెల ప్రసాద్ రెడ్డి, గంగారపు రమేష్, రాజేష్ భరద్వాజ్, శారద, ఉద్యోగ సంఘ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
- అర్బన్ బ్యాంకులో...
కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ లో పిఎసి చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు ముడుపు మోహన్, ముక్క భాస్కర్, లక్ష్మణ రాజు, మూల లక్ష్మి, విద్యాసాగర్, నాగుల సతీష్, మార్కరాజు, బొమ్మ రాతి సాయి కృష్ణ, బ్యాంకు ముఖ్యకారణర్వాణాధికారి నునుగొండ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.
- పారమిత విద్యాసంస్థలలో
నగరంలోని పారమిత ఉన్నత పాఠశాల, హెరిటేజ్, ఎక్స్ప్లోరికా విద్యాసంస్థలలో పారమిత విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఇ ప్రసాదరావు మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ ప్రసూన, రశ్మిత, అనుకర్ రావు, వినోద్ రావు, రాకేశ్, ప్రాచి, వి.యు.యం.ప్రసాద్, హనుమంత రావు, ప్రధానోపాధ్యాయులు బాలాజీ, ప్రశాంత్, కవిత, గోపికృష్ణ,శర్మిష్ఠ, శ్రీకర్, తదితరులు పాల్గొన్నారు.






