22 April, 2026 | 3:11 AM

ప్రాణాలు తీసిన రీల్స్ వ్యామోహం

22-04-2026 01:52 AM

రీల్స్ చేస్తూ ఒకరి మృతి

మేడ్చల్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): ఇంస్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్‌బుక్‌లో రీల్స్ చేస్తూ ఫేమస్ అవ్వాలనుకున్నాడు బాలుడు.. అదుపుతప్పి భవనం పైనుంచి పడడంతో మృతి చెందిన ఘటన నాచారం పరిధిలో జరిగింది. బాల్కనీ రైలింగ్ పిట్ట గోడపై ఫీట్స్ చేస్తుండగా పొరపాటున కిందపడిపోయాడు.. దీంతో తీవ్రంగా గాయపడ గా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

నాచారం మల్లాపూర్ గాంధీ బొమ్మ దగ్గర బస్తీలో నివసించే కుటుంబానికి చెందిన బాలుడు మితున్ (14) సమీపంలోని పాఠశాలలో చదువుతున్నట్లు తెలు స్తోంది.. స్నేహితులు ఎక్కువగా రీల్స్ వీడియోలు చేస్తుండటం చూసి తాను కూడా చేయడం మొదలుపెట్టాడు. కానీ దురదృష్టవశాత్తు ప్రమాదానికి గురై మృతి చెందాడు.. బాలుడి కుటుంబం బీహార్ రాష్ట్రానికి చెందిన భారీగా తెలిసింది.