6 May, 2026 | 9:16 PM

Breaking News

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •  

కోట పబ్లిక్ స్కూల్‌లో ముగిసిన క్రీడా ఉత్సవ్

08-03-2026 01:45 AM

విజేతలకు ఎమ్మెల్సీ డాక్టర్ అంజిరెడ్డి బహుమతులు ప్రదానం 

ఫుడ్ ఫెస్టోల్లో విద్యార్థుల ప్రతిభకు ప్రశంసలు

కరీంనగర్, మార్చి 7(విజయక్రాంతి): కరీంనగర్ నగరంలోని రేకుర్తిలో గల కోట పబ్లిక్ స్కూల్‌లో మూడు రోజులుగా నిర్వహిస్తున్న క్రీడ ఉత్సవ్ కార్యక్రమం శనివారం ఘనంగా ముగిసింది. ఈ వేడు కలకు పట్టభద్రుల ఎమ్మెల్సీ డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా వివిధ క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆయన చేతుల మీదుగా బహుమతులు,  ప్రశం సాపత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి క్రీడలు ఎంతో ముఖ్యమన్నారు.

చదువుతో కోట పబ్లిక్ స్కూల్ విద్యార్థుల్లో క్రీడా స్పూర్తిని పెంపొందించేందుకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలు అభినందనీ యమని కొనియాడారు. కోట పబ్లిక్ స్కూల్ చైర్మన్ డాక్టర్ డి.అంజిరెడ్డి కూ డా క్రీడా పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం అంజిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను వెలికితీయడానికి పాఠశాల యాజ మాన్యం ఎప్పటికప్పుడు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన ఫుడ్ ఫెస్ట్ కార్యక్రమాన్ని కూడా కోట విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ డి. అంజిరెడ్డి సందర్శించారు.  కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు స్వ యంగా తయారు చేసిన వివిధ రకాల వంటకాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మూడు రోజుల పాటు నిర్వహించిన క్రీడా ఉత్సవ్‌లో అథ్లెటిక్స్, పరుగులు, జం ప్స్, టీమ్ గేమ్స్ తదితర పోటీలు నిర్వహించి విజేతలను సత్కరించారు.