20 August, 2026 | 9:28 PM

కోటగిరిలో గోశాల నిర్మాణానికి స్థలం కేటాయించాలి

20-08-2026 08:35 PM

గ్రామ పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవ తీర్మాన పత్రాన్ని తహసిల్దార్ కు అందజేత

బాన్సువాడ,(విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో గురువారం స్థానిక గ్రామపంచాయతీ సర్పంచ్ బర్ల మధుకర్ వార్డు సభ్యుల ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ గంగాధర్ కు గోశాల నిర్మాణం స్థలం కోసం ఏకగ్రీవ తీర్మాన పత్రాన్ని  అందజేశారు. స్థానిక తహసీల్దార్ తో సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పరిధిలో  గత 14 ఆగస్టు నాడు నిర్వహించిన గ్రామ పంచాయతీ సాధారణ సమావేశంలో తీసుకున్న  తీర్మానాలలో గోశాల నిర్మాణం కొరకు ప్రభుత్వ స్థలాలను గుర్తించి కేటాయించాలి.

గ్రామ పరిధిలో రోడ్ల మీద సుమారు 50 వరకు వీధి పశువులు తిరుగుతున్నాయి.వీటి వల్ల వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అంతేకాకుండా సమీప పంట పొలాల్లోకి చొరబడి పంటలను తీవ్రంగా నష్టం చేస్తున్నాయని ప్రజల నుండి అనేక ఫిర్యాదులు రావడంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు పంచాయతీ పాలకవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగిందన్నారు. ఈ సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తున్నామని త్వరితగతంగా పరిష్కారమయ్యేలా చూడాలని తహసిల్దార్ ను కోరారు.