ఎక్సైజ్ ఉద్యోగుల నూతన కార్యవర్గం ఏర్పాటు
20-08-2026 08:33 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ప్రోహిబిషన్, ఎక్సైజ్ హెడ్ కాన్స్టేబుల్, కాన్స్టేబుల్ యూనియన్ ఎన్నికలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ శ్యామ్ రావు, జనరల్ సెక్రటరీ A. రాజేశ్వర్, ట్రీజరర్ సాయిని మహేష్, వైస్ ప్రెసిడెంట్ T. లింబాద్రి, అసోసియేట్ ప్రెసిడెంట్ R. సురేష్ సింగ్, జాయింట్ సెక్రటరీ B. మేరీ, పబ్లిసిటీ సెక్రటరీ P. శిరీష, ఎగ్జిక్యూటివ్ మెంబెర్ వంశీధర్ మరియు సౌజన్య గార్లను ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారులుగా N. రంగస్వామి, ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ K. అభిశేఖర్, ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, సీనియర్ అసిస్టెంట్ సరోజ జూనియర్ అసిస్టెంట్ దేవిక వ్యవహరించారు. కొత్త కార్యవర్గానికి సన్మానం చేశారు.






