ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని నూతన కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముందుగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన దేశానికి అందించిన సేవలను, ప్రజాస్వామ్యం, యువత, సాంకేతిక రంగం, గ్రామీణాభివృద్ధి కోసం చేసిన కృషిని నాయకులు స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ మార్కెట్ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవ రెడ్డి, మాజీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ గండ్రత్ సుజాత, మాజీ డీసీసీ సాజిద్ ఖాన్, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఖిజార్ పాషా, ఇచ్చోడా ఆత్మ కమిటీ చైర్మన్ కౌడాలా నారాయణ, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సుధాకర్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ ఆఫీసు ఇంచార్జ్ గౌలి సంజీవ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ ఓబీసీ సెల్ అధ్యక్షులు అంబకంటి అశోక్, sc విభాగం అధ్యక్షులు పరమేశ్వర్, రాష్ట్ర st సెల్ ఉపాధ్యక్షులు సెద్మకి ఆనంద్ రావు, జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షులు షాహిద్ అలీ, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు మోతిరామ్, జిల్లా కోశాధికారి హిమభిషేక్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ లు బండి దేవిదాస్ చారీ, లక్ష్మా రెడ్డి, మల్యాల కరుణాకర్, అక్టర్ అలీ, కన్య ప్రభాకర్, జిల్లా కాంగ్రెస్ సెక్రటరీ లు మీర్జా ఇమ్రాన్ బేగ్, మందకిని, జిల్లా కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు ప్రజాపతినిధులు మున్సిపల్ కౌన్సిలర్లు, ఆదిలాబాద్ పట్టణ వార్డ్ ప్రెసిడెంట్ లు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






