అర్హులందరికీ పెన్షన్ : ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
యాదగిరిగుట్ట, ఆగస్టు 11 : ఆలేరు నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందజేయడం జరుగుతుందని ఎవ్వరు అధైర్య పడవద్దని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. మం గళవారం యాదగిరిగుట్ట పురపాలక సంఘం కార్యాలయంలో ప్రభుత్వ విప్,ఆలేర్ శాసనసభ్యులు బీర్ల ఐలయ్య పెన్షన్ దరఖాస్తు ఫారాలు నింపిన దరఖాస్తుదారుల యొక్క పెన్షన్ దరఖా స్తు ఫారాలను పరిశీలించి సంబంధిత అధికారులకు ఇవ్వడం జరిగింది. ప్రజా ప్రభుత్వం అర్హులైన వారికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, కమీషనర్ బి శ్రీనివాస్ ,వైస్ చైర్ పర్సన్ బరిగే రమ్య రాంచందర్, కౌన్సిల్ సభ్యులు బూడిద మధు , కాట బత్తిని స్వప్న ఆంజనేయులు , బిట్టు సరోజ హరీష్ , ముక్కేర్ల మల్లేష్ యాదవ్, బబ్బూరి శ్రీధర్, కోఆప్షన్ సభ్యులు గౌలికర్ అరుణ రాజేష్ , మొ హ్మద్ రహి మ సలాం, కార్యాలయ సిబ్బంది, పుర ప్రముఖులు స్థానికులు పాల్గొన్నారు.






