12 May, 2026 | 1:30 AM

క్రీడలతోనే మానసిక ఉల్లాసం

12-05-2026 12:32 AM
  1. విఠాయిపల్లి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీ ప్రారంభం
  2. ఆమనగల్లు సీఐ వెంకటేశ్వర్లు

ఆమనగల్లు, మే 11 (విజయక్రాంతి): యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించినప్పుడే పరిపూర్ణమైన మానసిక ఉల్లాసం సిద్ధిస్తుందని ఆమనగల్లు సీఐ వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు విఠాయిపల్లిలో ఏర్పాటు చేసిన ’విఠాయిపల్లి ప్రీమియర్ లీగ్’  క్రికెట్ టోర్నమెంట్ను స్థానిక కౌన్సిలర్ అనిత శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన ఘనంగా ప్రారంభించారు. మున్సిపాలిటీ స్థాయి ఆటగాళ్ల కోసం నిర్వహిస్తున్న.

ఈ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన సీఐ, క్రీడాకారులను పరిచయం చేసుకుని, టాస్ వేసి టోర్నీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు శారీరక దృఢత్వానికే కాకుండా, మానసిక ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. యువత గెలుపోటములను సమానంగా స్వీకరించాలని, ఓటమిని విజయానికి తొలిమెట్టుగా భావించి ప్రతిభను చాటాలని సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు ధోళి, నితిన్ రెడ్డి, నాయకులు వెంకటేశ్వర రెడ్డి, మధుసూదన్ రెడ్డి, శ్రీధర్, పర్వతాలు, రవి, నరసింహ, శేఖర్, జంగయ్య, జగదీష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.