12 May, 2026 | 1:46 AM

నిరుపేదల ఆరోగ్యానికి భరోసా ‘సీఎం రిలీఫ్ ఫండ్’

12-05-2026 12:34 AM

 ఎమ్మెల్యే కసిరెడ్డి

కడ్తాల్, మే 11(విజయక్రాంతి) : నిరుపేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ ఎఫ్ )కొండంత అండగా నిలుస్తుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం తన నివాసంలో నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదారులకు ఆయన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలతో దూసుకుపోతోందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల పక్షానే ఉంటుందని, సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికీ చేరుతున్నాయని తెలిపారు. అనంతరం కడ్తాల్ మండలం కర్కల్ పహాడ్ గ్రామ పంచాయతీకి చెందిన పలువురు వార్డు సభ్యులు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బట్టు కిషన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, యాట నర్సింహా, తేజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.