17 July, 2026 | 5:10 PM

లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఉద్యోగులను సస్పెండ్ చేయాలి

17-07-2026 05:02 PM

ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలో కొందరు ఉద్యోగులు కార్యాలయంలో పనిచేస్తున్న మహిళ ఉద్యోగినిని లైంగికంగా వేధిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వీరిని వెంటనే ఉద్యోగం నుండి తొలగించాలని శుక్రవారం రోజున  సిపిఐ ఆధ్వర్యంలో కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ కి వినతి పత్రం అందజేయడం జరిగిందని న్యాలపట్ల రాజు పైడిపల్లి రాజులు తెలిపారు. 

ఈ సందర్భంగా సిపిఐ సహాయ కార్యదర్శులు ఎన్. రాజు, పైడిపల్లిరాజులు మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయంలో ఎన్నడు లేని విధంగా లైంగిక వేదింపులు ఆరోపణలు రావడం చాలా బాధాకరమని ఉద్యోగులు తమ పని తను చేసుకునే సందర్భంలో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడి  వేధించడం  దుర్మార్గమైన చర్య అని ఆరోపించారు. వెంటనే మహిళ ఉద్యోగినిని వేధింపులకు గురి చేస్తున్న ఉద్యోగులను వెంటనే సస్పెండ్ చేయాలని, వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేశారు. 

స్పందించిన మేయర్

ఈ సమస్య పైన మహిళా అధికారులతో కమిటీ వేశామని కమిటీ రిపోర్ట్ రెండు రోజుల్లో వస్తుందని రిపోర్ట్ రాగానే వారి పై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.