17నుంచి పార్లమెంట్ ప్రత్యేక సెషన్?
- కేంద్రప్రభుత్వ వ్యూహం
- మూడు రోజుల పాటు నిర్వహణ
- డీలిమిటేషన్, మహిళా బిల్లుల ఆమోదమే లక్ష్యం?
- రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నంలో కేంద్రం
- నిరాకరించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్
న్యూఢిల్లీ,ఆగస్టు 5: డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు కేంద్రప్రభుత్వం పావులు కదు పుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఈనెల 13న వర్షాకాల సమావేశాలు ముగిసిన వెం టనే, 17 నుంచి 19వ తేదీ వరకు మూడు రోజుల పాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఈ సమావేశాల్లో రెండు బిల్లుపై విస్తృతంగా చర్చించి ఆమోదం పొందేలా ప్రయ త్నాలు ముమ్మరం చేసింది. ఈ రెండు బిల్లు లు రాజ్యాంగ సవరణకు సంబంధించినవిగా ఉండటంతో ఉభయసభల్లో మూడింట రెం డొంతుల మెజారిటీ అవసరం. మద్దతు కూ డగట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు ప్రారంభిం చింది. తగిన మెజారిటీ లభిస్తే ఈ బిల్లులు లోక్‌సభ, రాజ్యసభల్లో ఆమోదం పొందే అవకాశం ఉంది.
రాహుల్‌ను కలిసిన కిరణ్ రిజిజు
డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులకు మద్దతు కూడగట్టే ప్రయత్నంలో భాగంగా పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు బుధవారం లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీని పార్లమెంట్‌లో సంప్రదించారని పార్టీ వర్గాలు తెలి పాయి. అయితే కేంద్ర ప్రభుత్వ అభ్యర్థనను రాహుల్‌గాంధీ తిరస్కరించినట్లు సమాచారం.
ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసుల చర్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పార్లమెంట్‌కు వచ్చి ప్రకటన చేయాలని, అప్పటి వరకు సభలో కార్యకలాపాలు జరగవని రాహుల్‌గాంధీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌తో పాటు సమాజ్‌వాదీ పార్టీ సహా ఇతర కీలక ప్రతిపక్ష పార్టీల నేతలను కూడా కేంద్ర మంత్రులు కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజ్యాంగ సవరణ బిల్లులకు అవసరమైన మద్దతు సాధిం చి బిల్లులను ఆమోదింపజేయడమే లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.






