6 August, 2026 | 2:49 AM

పోలీస్ ఉద్యోగాలకు ఉచిత పుస్తకాల పంపిణీ

06-08-2026 01:29 AM

డి.ఎస్.పి అరుణ్ కుమార్ 

చర్ల, ఆగస్టు 5, (విజయక్రాంతి): చర్ల మండలంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సురక్షక్ తిరంగా కార్యక్రమంలో భాగంగా, బుధవారం రెండు కీలక కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం చర్ల మండల కేంద్రంలోని ఏకలవ్య పాఠశాల సమీపంలోని నూతన లైబ్రరీలో ఎస్త్స్ర, కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి  అరుణ్ కుమార్ , సి ఐ  రాజువర్మ , ఎస్త్స్ర  లు ఆర్.నర్సిరెడ్డి , పి.కేశవ్ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డిఎస్పి మాట్లాడుతూ ‘యువత ఉద్యోగాలు సాధించాలి. అందుకే ప్రభుత్వం తరపున ఈ లైబ్రరీలో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉంచాం. కష్టపడి చదివి మండలానికి మంచి పేరు తీసుకురావాలనీ కోరారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలనీ, ఎలాంటి అనుమానాస్పద లింకులు క్లిక్ చేయొద్దు.‘ అని తెలిపారు. హాజరైన యువత మాట్లాడుతూ ‘పుస్తకాలు ఉచితంగా ఇవ్వడంతో పాటు పోలీస్ అధికారులు నేరుగా వచ్చి మోటివేట్ చేయడం చాలా స్ఫూర్తినిచ్చింది. ధన్యవాదాలు సార్‘ అంటూ హర్షం వ్యక్తం చేశారు