6 August, 2026 | 2:47 AM

92 ఆలయాలకు రూ.30.71 లక్షల సాయం-

06-08-2026 01:30 AM

శేరిలింగంపల్లి,ఆగస్టు 5 (విజయక్రాంతి): ఆషాఢ మాస బోనాల పండుగ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని 92 దేవాలయాలకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.30,71,000 ఆర్థిక సహాయం చెక్కులను ఎమ్మెల్యే గాంధీ ఆలయ ధర్మకర్తలకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భక్తులకు తాగునీరు, భద్రత, పారిశుద్ధ్యం వంటి ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని, ఉత్సవాలు ప్రశాంతంగా, ఘనంగా జరగాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆలయాల అభివృద్ధి, భక్తుల సౌకర్యాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.