calender_icon.png 6 February, 2026 | 3:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నువ్వు మా కొడుకు లెక్క.. నిన్నే గెలిపిస్తాం !

06-02-2026 01:40:41 AM

7వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్థి సంతోష్‌కు ప్రజల దీవెనలు

గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ౭వ వార్డులో విశేష ఆదరణ

గజ్వేల్, ఫిబ్రవరి 5(విజయక్రాంతి): గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ 7వ వార్డు బీఆర్‌ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి ఎన్ సీ సంతోష్‌కు ప్రజల నుంచి చక్కని స్పందన లభిస్తుంది. ఇంటింటి ప్రచారం చేస్తున్న ఎంసీ సంతోష్ ను ఎర్రవల్లి సింగారం గ్రామాల మహిళలు తమ కొడుకు లాగా భావిస్తూ నువ్వే గెలుస్తావ్ అంటూ దీవెనలిస్తున్నారు.ఈ సంద ర్భంగా ఎన్‌సీ సంతోష్ మాట్లాడుతూ ఎర్రవల్లి సింగారం గ్రామ ప్రజలు అతి తక్కువ కాలంలో తనకు చేరువయ్యారని, ప్రజలంతా తమ కుటుంబ సభ్యునిలాగా భావిస్తున్నట్లు తెలిపారు.

ప్రచారంలో ఇంటింటా చక్కని స్పందన లభిస్తుందని, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించడానికి ప్రజలంతా సిద్ధం గా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.  తనపై విశ్వాసాన్ని పెంచుకున్న ప్రజలందరి నమ్మకాన్ని కష్టపడి పనిచేసి నిలుపుకుంటా నన్నా రు. రెండు గ్రామాల సమస్యలు పరిష్కరించడంతోపాటు అభివృద్ధిలో ముందుం చుతా నని మరోసారి ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి దేవి రవీందర్, నా యకులు భాస్కర్ గౌడ్, రామ్ రెడ్డి, పెంటారెడ్డి, ప్రభాకర్ రెడ్డి రత్నారెడ్డి, శివకుమార్, నాగేష్, స్వామి, లక్ష్మణ్ చారి పాల్గొన్నారు.