17-02-2026 09:21:25 PM
బుగ్గరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
సిద్దిపేట రూరల్: తెలంగాణ జాతిపితగా పేరుగాంచిన కే. చంద్రశేఖర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని భారత రాష్ట్ర సమితి మండల శాఖ ఆధ్వర్యంలో నారాయణరావుపేటలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ స్వయంభూ బుగ్గరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మండల శాఖ నాయకులు కొనాయగారి ఎల్లయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కుంబాల ఎల్లారెడ్డి, మాజీ ఎంపీపీ ఒగ్గు బాలమల్లు, మాజీ వైస్ ఎంపీపీ సంతోష్ కుమార్, పూసల కిషన్, ఆంజనేయులు పాల్గొన్నారు. అలాగే వివిధ గ్రామాలకు చెందిన తాజా మాజీ సర్పంచ్‌లు, గ్రామ శాఖ అధ్యక్షులు తదితరులు హాజరై కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.