18 July, 2026 | 12:28 PM

Breaking News

Vikram-1 రాకెట్ విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   విక్రమ్-1 రాకెట్ ప్రయోగం వాయిదా   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •   వనదుర్గమ్మను దర్శించుకున్న సినీ నటుడు మంచు విష్ణు   •  

సమర్థవంతమైన ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక చర్యలు

10-02-2026 06:51 PM

జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కె.హరిత

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఈ నెల 11వ తేదీన జరగనున్న పోలింగ్ నేపథ్యంలో సమర్థవంతమైన ప్రక్రియ నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కె.హరిత తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ ద్వారా ఆసిఫాబాద్, కాగజ్ నగర్ మున్సిపాలిటీలలోని వార్డుల పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు, పోలింగ్ సిబ్బంది ఏర్పాట్లు చేయాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి విధులు నిర్వహించాలని తెలిపారు. పోలింగ్ సరలిని వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించడం జరుగుతుందని, జిల్లాలోని మున్సిపాలిటీలలో పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ గౌతమ్ రాజు తదితరులు పాల్గొన్నారు.