18 July, 2026 | 12:45 PM

Breaking News

సైబరాబాద్‌వ్యాప్తంగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు   •   Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   విక్రమ్-1 రాకెట్ ప్రయోగం వాయిదా   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •  

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నాణ్యతతో చేపట్టాలి

10-02-2026 06:48 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని బంజారా తండా గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను, పెద్ద ఆత్మకూరులో ప్రభుత్వ పాఠశాలలను అంగన్వాడి కేంద్రామును, వాటిలో ఉన్న సదుపాయాలను, రాఘవపల్లి గ్రామంలో నర్సరీని ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ... ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు వేగవంతం చేసి నాణ్యతతో నిర్మించాలని సూచించారు. బంజర తండ గ్రామానికి 19 ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనట్లు 19 ఇందిరమ్మ ఇండ్లు పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.

విద్యార్థులకు మెనూ ప్రకారము మంచి ఆహారాన్ని అందించాలని, ఉపాధ్యాయులు సమయాన్నిసారం పాటించాలని తెలిపారు. రాఘవపల్లిలో నర్సరీ నిర్వాణ సక్రమంగా చేపట్టి గ్రామానికి మొక్కల పెంపకం లక్ష్యాన్ని పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాఘవపల్లి గ్రామ సర్పంచ్ నార్ల గంగమని మల్లేశం, కార్యదర్శులు మమత, సావిత్రి, ఫీల్డ్ అసిస్టెంట్ మల్లవ్వ తదితరులు ఉన్నారు.