రాజీ మార్గమే రాజ మార్గం
జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేష్
సుల్తానాబాద్,(విజయక్రాంతి): రాజీ మార్గమే రాజ మార్గం అని, లోక్ అదాలత్ లతో ఇరువర్గాలకు సత్వర న్యాయం అందుతుందని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేష్ అన్నారు. శనివారం మండల న్యాయసేవాదికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక మున్సిఫ్ కోర్టు అవరణలో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి గణేష్ మాట్లాడుతూ... లోక్ అదాలత్ లో ఇరు వర్గాల రాజీ కుదుర్చుకుని కేసులనుపరిష్కరించుకోవచ్చనీ, తద్వారా ఇరువర్గాలకు సమ న్యాయం అందుతుందని అన్నారు. క్షణికావేశంలో చేసిన నేరాల వల్ల భవిష్యత్తు కోల్పోతారని, వ్యయ్య ప్రయాసలకు గురికాకుండా ఉండేందుకు లోక్ అదాలత్ లలో కేసులనుపరిష్కరించుకోవాలని సూచించారు. లోక్ అదాలత్ లో పలు క్రిమినల్, చెక్ బౌన్స్, కుటుంబ తగాదాలు, డ్రంక్ అండ్ డ్రైవ్, సివిల్ కేసులకు సంబంధించిన దాదాపు కేసులు పరిష్కరించినట్లు కోర్టు అధికారులు తెలిపారు.






