సామూహిక మరుగుదొడ్లు ప్రారంభించిన కలెక్టర్
18-07-2026 04:26 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత తుపాను మరుగుదొడ్లు నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా పిలుపునిచ్చారు. శనివారం సామూహిక మరుగుదొడ్ల కాంప్లెక్స్ ప్రారంభించారు. అనంతరం ఆయా గ్రామాల్లో వానాకాలం సీజన్లో వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ప్రజలకు ప్రతిరోజు స్వచ్ఛమైన నీరు అందించాలని మిషన్ భగీరథ అధికారులకు సూచించారు. పరిసరాల పరిశుభ్రత ఇంటికో ఇంకుడు గుంత నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ విజయలక్ష్మి మిషన్ భగీరథ ఈ ఈ సందీప్ స్థానిక అధికారులు నాయకులు పాల్గొన్నారు.






