పాఠశాలలో మొక్కలు నాటిన కలెక్టర్
18-07-2026 04:22 PM
నిర్మల్,(విజయక్రాంతి): నర్సాపూర్ జి మండల కేంద్రంలో గల ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా శనివారం సందర్శించారు. ఉదయం 9 గంటలకి పాఠశాలకు చేరుకున్న కలెక్టర్ విద్యార్థులు ఉపాధ్యాయుల ప్రభాత వేరులో పాల్గొన్నారు. పాఠశాల పరిసర ప్రాంతాలను సందర్శించి కల్పించవలసిన సౌకర్యాలపై అధికారులకు సూచనలు చేశారు. పాఠశాలలో మొక్కలు నాటి వాటి సంరక్షించాలని విద్యార్థులకు సూచించారు. నర్సాపూర్ జి ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మంచి విద్య అందుతుందని ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.






