6 June, 2026 | 6:32 PM

Breaking News

గ్రామసభలను పకడ్బందీగా నిర్వహించాలి: ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి   •   లింగారెడ్డిగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   ప్రణాళికాబద్ధంగా కార్పొరేషన్‌ను అభివృద్ధి చేసుకుందాం   •   ఫార్మర్ రిజిస్టీ తప్పని సరి   •   వన్యప్రాణులు, పక్షుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకం   •   కాంగ్రెస్ పార్టీలో చేరిన రాఘవపల్లి గ్రామ సర్పంచ్, పాలకవర్గం   •   కొమ్ముగూడెం పంచాయతీలో సర్పంచ్ సోయం సత్యవతి అధ్యక్షతన గ్రామ సభ   •   ఆలిండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన కానిస్టేబుల్ శ్రీలత   •   గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రజలు అవగాహన కలిగి ఉండాలి   •   కోల్‌కతా మెట్రోలో ప్రయాణించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌   •  

గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రజలు అవగాహన కలిగి ఉండాలి

06-06-2026 05:42 PM

గుంజపడుగు సర్పంచ్ దండేవేన సంధ్య బానేష్

మంథని,(విజయక్రాంతి): మంథని మండలం గుంజపడుగు గ్రామంలో 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక'లో భాగంగా శనివారం ప్రత్యేక గ్రామ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ దండేవేన సంధ్య బానేష్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి వివరిస్తూ, భవిష్యత్తులో చేపట్టబోయే పనులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.

ప్రధానంగా గ్రామంలో శానిటేషన్, విద్యుత్ స్తంభాల నిర్వహణపై అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ముఖ్యంగా బాల్య వివాహాల దురాచారాన్ని అరికట్టేందుకు గ్రామస్తులు అందరూ అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. వంగిపోయిన కరెంటు స్తంభాలు, ప్రమాదకరంగా వేలాడుతున్న తీగల పట్ల జాగ్రత్తగా ఉండాలని, తడి చేతులతో స్విచ్‌లను తాకవద్దని ప్రజలకు అవగాహన కల్పించారు. 

వ్యవసాయ శాఖ  ఏవో డాక్టర్ నవ్య మాట్లాడుతూ, ప్రస్తుతం రైతులు సాగు చేయాల్సిన పంటల గురించి, ఆధునిక సాగు పద్ధతులపై రైతులకు వివరించారు. వడదెబ్బ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా పరిసరాల పరిశుభ్రతపై వైద్యాధికారి అవగాహన కల్పించారు. జీపీఓ మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ గురించి ప్రజలకు తెలియజేశారు.