6 June, 2026 | 6:58 PM

'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక' ముగింపు కార్యాచరణ

06-06-2026 05:38 PM

ఆలేరు,(విజయక్రాంతి): ఆలేరు మున్సిపాలిటీ పరిధిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ముగింపు కార్యాచరణ ప్రణాళిక, ఈరోజు  శనివారం రోజున 4వవార్డు, 5వార్డు, 6వార్డులలో  వార్డు సభలు నిర్వహించడం జరిగింది. ప్రజలకు సాలిడ్ వెస్ట్ మేనేజిమెంట్  రూల్స్, 2026, జల్ సంచయ్–జల్ భగీరత పథకం క్రింద ఇంకుడు గుంతల నిర్మాణం, మురికి  కాలువల శుభ్రం, మంచి నీటి సరఫరా, పారిశుద్ధ్యం, వీది దీపాలు, ఫిర్యాదుల పరిష్కారం వంటి  అంశాలను చర్చించడం జరిగింది. మండలంలోని పలు గ్రామాలలో ప్రతిష్టప్రజాపాలన ప్రగతి ప్రణాళిక–99 రోజుల కార్యాచరణ గ్రామసభలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.

మందనపల్లి, టంగుటూరు, శారజీపేట,తూరుపుగూడెం గ్రామాలలో మండల స్థాయి అధికారుల బృందం పర్యటించి, గ్రామస్తులతో కలిసి సభలు నిర్వహించారు. ఈ గ్రామసభలలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు, ఎం పి డి ఓ ఘనద్రవ్య వ్యర్థాల నిర్వహణ 2026 నిబంధనలపై అవగాహన కల్పించారు, గ్రామ పారిశుద్ధ్యం & లైటింగ్, మండల పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో గ్రామాల్లో సంపూర్ణ పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ, మురికి కాలువల పూడికతీత, ఆయిల్ బాల్స్ తయారీ, శిథిలావస్థలో ఉన్న ఇండ్ల గుర్తింపుపై చర్చించారు.

ఓటర్ల జాబితా & జనగణన గురించి తహశీల్దార్ రాబోయే 'జనగణన 2027' మరియు 'ఓటర్ల జాబితా సవరణ' ప్రత్యేక కార్యక్రమం గురించి వివరించారు, వ్యవసాయం గురించి మండల వ్యవసాయ అధికారి పంట మార్పిడి, పంటల వికేంద్రీకరణ, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. త్రాగునీరు, మంచినీటి సరఫరా ఇంజనీర్ పరిశుభ్రమైన తాగునీటి సరఫరా, క్లోరినేషన్, మరియు పైప్‌లైన్ లీకేజీల అరికట్టడంపై మాట్లాడారు. ఉపాధి హామీ జల సంరక్షణ - మన సంరక్షణ’ లో భాగంగా వర్షపు నీటి సంరక్షణ కట్టడాలు, ఇంకుడు గుంతల ప్రాధాన్యతను వివరించారు. ఆరోగ్యం & వైద్యం వైద్యాధికారి వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు, వాటి నివారణకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలను తెలిపారు.

శాంతిభద్రతలు, పోలీస్ శాఖ (సబ్ ఇన్స్పెక్టర్) ఆధ్వర్యంలో డ్రగ్స్ నివారణ, రోడ్డు ప్రమాదాల నివారణ మరియు గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణపై అవగాహన కల్పించారు. విద్య & బడిబాట (ఎం ఇ ఓ)ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, 'బడిబాట' ద్వారా విద్యార్థుల నమోదు పెంపు మరియు అల్పాహార భోజన పథకం అమలుపై వివరించారు. విద్యుత్ & గృహ నిర్మాణం,ఇండ్లపై సోలార్ విద్యుత్ ఏర్పాటు, అలాగే మొదటి విడత ఇందిరమ్మ గృహప్రవేశాలు, రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై సంబంధిత ఇంజనీర్లు ప్రజలకు అవగాహన కల్పించారు.