31 July, 2026 | 2:26 PM

విబిజి రామ్ జి ఉద్యోగులు పెన్ డౌన్

31-07-2026 01:19 PM

దమ్మపేట, జూలై 31(విజయ క్రాంతి): మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గల వి బి జి రామ్ జి ఉద్యోగులు రాష్ట్ర జే ఏ సి పిలుపు మేరకు పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహించి, నిరసన తెలియ జేశారు. ఈ సందర్భంగా జిల్లా జే ఏ సి అధ్యక్షులు వేముల సుధాకర్ మాట్లాడుతూ వి బి జి రామ్ జి ఉద్యోగులకు ఆగస్టు 15, 2026 వ తేదీలోపు పే స్కేల్ అమలు చేసి ఉత్తర్వులు జారీ చేయాలన్నారు.

రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రతినెలా మొదటి తేదీన వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, పెండింగ్లో వున్న మూడు నెలల వేతనాలు వెంటనే విడుదల చేయాలని, సెలవు రోజుల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగులకు వర్తించే విధంగా ప్రయోజనాలు కల్పించాలనే పలు డిమాండ్లతో పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జే ఏ సి అధ్యక్షులు వేముల సుధాకర్, కోశాధికారి జి డి ఆర్ పట్నాయక్, జిల్లా టెక్నికల్ అసిస్టెంట్ అసోసియేషన్ కోశాధికారి రాఘవ రావు, జే ఇ స్వామి, టి ఏ లు నాగమణి, లక్ష్మయ్య, సిందూరి, సి ఓ బాబా పాల్గొన్నారు.