పదహారోసారీ!
నారాయణపురం రైతులకు దక్కని రైతు భరోసా
బీఅరెస్ సర్కార్ హయాంలో అటవీ భూములుగా రికార్డ్
అప్పటి నుంచి సాయానికి నోచుకొని రైతులు
మహబూబాబాద్, జూలై 1 (విజయక్రాంతి): అధికారుల తప్పిదం.. ఆ రైతుల పాలిట శాపంగా మారింది. తాత ముత్తాతల కాలం నుండి సాగులో ఉన్న భూముల వివరాలను గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో 2017 లో నిర్వహించిన భూప్రక్షాళన సమయంలో అటవీ భూమి గా నమోదు చేయడంతో రైతుబం ధు అమలు కాకుండా పోయింది.
దాదాపు తొమ్మిదేళ్లుగా సుమారు 1,400 మంది రైతు లు దాదాపు 1800 ఎకరాల భూమి రికార్డు ల మార్పు కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు, చివరకు సిసిఎల్‌ఏ, రాష్ట్ర సచి వాల యం ముట్టడి కార్యక్రమాలను నిర్వహించి నా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమం లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర రెవెన్యూ శా ఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నారాయణపురం రైతులకు న్యాయం చేస్తామని హా మీ ఇచ్చిన నేపథ్యంలో ఇటీవల ప్రత్యేకంగా నారాయణపురం గ్రామ భూముల రీ సర్వే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇటీవలే సర్వే పూర్తి చేసిన అధికారులు పట్టా పాస్ పుస్తకాల జారీ కోసం పూర్తి చేశారు. దాదాపు సా గులో ఉన్న రైతులందరికీ పట్టా పాస్ పుస్తకాలు జూన్ 22 నుంచి భూభారతి కా ర్యక్రమం ద్వారా ప్రారంభించగా, పట్టా పాస్ పుస్తకాల ముద్రణ ప్రక్రియ చివరి అంకానికి చేరింది. అయితే ప్రభుత్వం 16వసారి రాష్ట్రంలోని రైతులకు రైతు భరోసా పథకంలో సా గు పెట్టుబడి కోసం ఎకరానికి 6,000 చొ ప్పున ఈ వానాకాలం పెట్టుబడి కింద మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు.
తాజాగా సాగు పెట్టుబడి రైతు భరోసా కోసం భూభారతి ద్వారా జూన్ 15, 2026 వరకు పట్టా పాస్ పుస్తకాలు పొందిన రైతులు ఈనెల 5లోగా దర ఖాస్తు చేసుకోవడానికి చివరి గడువు విధించింది. అయితే నారాయణపురం రైతులకు పట్టా పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి మరి కొద్ది రోజులు పట్టే అవకాశం ఉండడంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పట్టా పాస్ పుస్తకాలు అందించాలనే నిర్ణయంతో ఆ గ్రామ రైతులు 16వసారి కూడా రైతు భరోసా సాగు పెట్టుబడి పథకానికి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈనెల 5న రైతు భరోసా దరఖాస్తుకు చివరి తేదీ కావడం, పట్టా పాస్ పుస్తకాల జారీ జూన్ 15వ తారీకు ముందు కట్ ఆఫ్ తేదీ నిర్ణయించడంతో నారాయణపురం రైతులకు ఈ‘సారీ’ కూడా రైతు భరోసా అందుకోవడానికి సాంకేతిక సమస్య తలెత్తే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే తమ గ్రామ రైతులను ప్రత్యేకంగా పరిగణించాలని, ఈసారి తప్పనిసరిగా రైతు భరోసా ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ గ్రామ రైతులు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు.






