15 June, 2026 | 7:34 PM

Breaking News

పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •   సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •  

ప్రత్యేక అవసరాల పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ

14-10-2025 01:03 AM

కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్, అక్టోబర్ 13 (విజయక్రాం తి): ఆదిలాబాద్‌లోని డైట్ కళాశాలలో ఐఈ ఆర్‌పీఎస్, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్‌లకు ప్రశస్త యాప్, సి.డబ్ల్యూ.ఎస్.ఎన్ టైటిల్మెం ట్స్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ పైన ఓరియంటేషన్ ట్రైనింగ్  నిర్వహించారు. సోమ వారం ఈ ట్రైనింగ్‌కు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని, భవిత కేంద్రం ద్వారా ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు, శిక్షణా నిర్వాహకులకు పలు సూచనలు సలహాలు చేశారు.

ఈ సందర్భంగా ట్రైనింగ్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ని పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ టీచర్లకు నిర్వహించే ఈ ట్రైనింగ్‌ను సద్వినియోగం చేసుకో వాలన్నారు. ఈ ట్రైనింగ్ ముఖ్య ఉద్దేశం ప్రత్యే క అవసరాలు గల పిల్లల విద్యా, ఆరోగ్య సౌకర్యాలు మెరుగుపరచడం జరుగుతోందన్నారు. 

సిడబ్ల్యూఎస్‌ఎన్ పిల్లలు ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్య పై ఐఆర్పిఎస్ స్పెషలైజేటర్స్ కు సూచనలు చేయడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సలోని, జిల్లా విద్యాశాఖ అధికారులు తిరుపతి, డైట్ కళాశాల ప్రిన్సిపల్ కిరణ్ పాల్గొన్నారు.