16 March, 2026 | 3:52 AM

ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి ప్రత్యేక దృష్టి సారించాలి

16-03-2026 12:41 AM

ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య 

ముకరంపుర, మార్చి 15 (విజయక్రాంతి): ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పని చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు. ఆదివారం ప్రైవేట్ కార్యక్రమం కోసం కరీంనగర్ కు వచ్చిన ఆయనకు నగరంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద అధికారులు ఘన స్వాగతం పలికారు.

ఇన్చార్జి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తిరుపతిరావు, జిల్లా ఎస్సీ వెల్ఫేర్ అధికారి విజయపాల్ రెడ్డి, ఇన్చార్జి జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి దివాకర్ రావు బొకేలు అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ వెంకటయ్య జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, అమలు చేస్తున్న పథకాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చైర్మన్ సూచించారు. అధికారులు బాధ్యతాయుతంగా పనిచేస్తూ పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు.